Skip to main content

డబ్ల్యూఈఎఫ్ సదస్సులో గోయల్ ప్రసంగం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో జనవరి 23న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు.
Current Affairs‘వ్యూహాత్మక దృక్కోణం- భారతదేశం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ... భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నట్టు పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

సదస్సులో ఇతర ముఖ్యాంశాలు...
  • బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో ఈ విషయమై సెంట్రల్ బ్యాంకులకు సాయపడేందుకు డబ్ల్యూఈఎఫ్, 40 దేశాల కేంద్ర బ్యాంకులతో కూడిన కమ్యూనిటీ ఓ కార్యాచరణను రూపొందించింది.
  • పర్యావరణ అనుకూలమైన, నైతిక ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు స్పందించేందుకు వీలుగా అన్ని రంగాల్లోని వ్యాపార సంస్థలకు సాయపడే విధంగా రూపొందించిన బ్లాక్ చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రపంచ ఆర్థిక వేదికలో ఆవిష్కరించారు.
  • డిజిటల్ ట్యాక్స్ సమస్యల పరిష్కార ప్రణాళికకు 137 దేశాలు మద్దతిచ్చినట్లు ఓఈసీడీ చీఫ్ ఆంగెలాగురియా చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సులో
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
Published date : 24 Jan 2020 05:40PM

Photo Stories