డబ్ల్యూఈఎఫ్ ఇంటర్నెట్ నిబంధనలు విడుదల
Sakshi Education
ఇంటర్నెట్ వినియోగ దారుల భద్రత కోసం తయారుచేసిన నూతన ఇంటర్నెట్ నిబంధనలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) జనవరి 23న విడుదల చేసింది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 50వ వార్షిక సమావేశాల సందర్భంగా తాజా నిబంధనలను ఆవిష్కరించారు. ఈ నిబంధనలు 180 దేశాల్లోని వందకోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను తీవ్రమైన సైబర్ దాడుల నుంచి రక్షిస్తాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. అలాగే 2021 నాటికి సైబర్ నేరగాళ్ళబారి నుంచి 6 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చునని వెల్లడించింది. నూతన ఇంటర్నెట్ నిబంధనలను ఐఎస్‌పీ(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్), ప్రముఖ బహుపాక్షిక సంస్థల బృందం తయారు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ ఇంటర్నెట్ నిబంధనలు విడుదల
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎందుకు : ఇంటర్నెట్ వినియోగ దారుల భద్రత కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ ఇంటర్నెట్ నిబంధనలు విడుదల
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎందుకు : ఇంటర్నెట్ వినియోగ దారుల భద్రత కోసం
Published date : 24 Jan 2020 05:37PM