Skip to main content

August 13th Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 13, 2025 తెలుగులో కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..

UPSC, APPSC, TSPSC గ్రూప్స్, రైల్వేస్ (RRB), బ్యాంక్స్, SSC వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఆగస్టు 8వ తేదీకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్‌లను అందిస్తోంది. వాటిని ఇక్క‌డ తెలుసుకుందాం.
Sakshi Education Current Affairs in telugu and News Updates  generalknowledge questions with answers

వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వాటి చివ‌రిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

➤ITReturns: దేశంలో ఆదాయపు పన్ను కట్టింది ముగ్గురిలో ఒకరే! ఐటీ రిటర్నుల దాఖలులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇదే, మరి మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానం ఉన్నాయంటే...?

దేశంలో ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, వాస్తవంగా పన్నులు చెల్లిస్తున్న వారు మాత్రం మూడింట ఒక వంతు మాత్రమేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 8.39 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు చేయగా, వారిలో కేవలం 33.5% మంది మాత్రమే పన్నులు చెల్లించారు.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి.. 

➤GI tag products list in india: తెలుగు రాష్ట్రాలు నుంచి భౌగోళిక గుర్తింపు (GI) పొందిన ఉత్పత్తుల జాబితా.. అసలు ఎప్పటి నుంచి GI ట్యాగ్ ఇస్తున్నారు..?

భౌగోళిక గుర్తింపు (Geographical Indication - GI) పొందిన ఉత్పత్తుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో 20 లోపే ఉంది. దేశవ్యాప్తంగా 2004 నుండి 2024 వరకు మొత్తం 643 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించగా, ఆంధ్రప్రదేశ్‌లో 19 మరియు తెలంగాణలో 17 ఉత్పత్తులకు మాత్రమే జీఐ  ట్యాగ్ గుర్తింపు దక్కింది.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤Independence Day 2025 event tickets: స్వాతంత్ర్య దినోత్సవం 2025 వేడుకలను ఎర్రకోట నుంచి లైవ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఆన్ లైన్ లో ఇలా సీటు బుక్ చేసుకోండి..?

భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈ శుక్రవారం, ఆగస్టు 15, 2025న ఘనంగా జరుపుకోనుంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతి ఏటా వేలాది మంది ప్రజలు ఈ ఐకానిక్ వేడుకకు హాజరవుతారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడాలనుకునే పౌరులు ఇప్పుడు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..


➤New Income Tax Bill 2025: నూతన ఆదాయపు పన్ను-2025 బిల్లుకు ఆమోదం తెలిపిన పార్లమెంట్...అసలు ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యమేమిటంటే..? ఎప్పటి నుంచి అమలోకి రానుంది...?

భారత పార్లమెంటు ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలలో నూతన ఆదాయపు పన్ను (ఐటీ) బిల్లు-2025కు ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ఆగస్టు 11న (సోమవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అది కొద్ది నిమిషాల్లోనే పాసయింది. ఆగస్టు 12న (మంగళవారం) రాజ్యసభలో కూడా ఓటింగ్‌లో నెగ్గింది. ఈ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. ఆమోదముద్ర పడిన వెంటనే ఇది చట్టంగా మారుతుంది.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి...

August 12th Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 12, 2025 తెలుగులో కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..

 Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 13 Aug 2025 03:37PM

Photo Stories