Skip to main content

August 12th Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 12, 2025 తెలుగులో కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..

UPSC, APPSC, TSPSC గ్రూప్స్, రైల్వేస్ (RRB), బ్యాంక్స్, SSC వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఆగస్టు 8వ తేదీకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్‌లను అందిస్తోంది. వాటిని ఇక్క‌డ తెలుసుకుందాం.
Sakshi Education Current Affairs in telugu and News Updates  generalknowledge questions with answers

వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వాటి చివ‌రిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

Election Commission of India: దేశంలో 810 రాజకీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం ఎందుకు రద్దు చేసింది..? కారణాలేంటి, ప్రభావం ఎలా ఉండనుంది..?

ఎన్నికల నిబంధనలను పాటించని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా రెండు విడతలుగా మొత్తం 810 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. మొదటి జాబితాలో 334 పార్టీలు, రెండో జాబితాలో మరో 476 పార్టీలను తొలగించింది. ఈ రద్దు చేయబడిన పార్టీలలో తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 44 పార్టీలు ఉన్నాయి.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤National Sports Governance Bill 2025: నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు 2025 కు ఆమోదం తెలిపిన లోక్‌సభ, ఈ బిల్లుతో క్రీడారంగంలో ఎటువంటి మార్పులు చూడొచ్చు..?

జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు(నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు/National Sports Governance Bill 2025)బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రం తర్వాత క్రీడా రంగంలో తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో ఇది ఒకటి అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశాలు మరియు అందులోని ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤Minimum Balance ను పెంచిన ICICI  బ్యాంకు..ఇతర బ్యాంకులు ఇదే బాటలో నడుస్తాయా?..ఇదే జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి?

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ICICI బ్యాంకు, ఆగస్టు 1 నుండి కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Average Balance: MAB) నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పుల ప్రకారం, మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లోని కొత్త ఖాతాలకు MAB ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ-అర్బన్ ప్రాంతాలకు రూ.25,000, గ్రామీణ ప్రాంతాలకు రూ.10,000కు పెరిగింది. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤Typhoon Podul: తైవాన్ ను గజగజలాడిస్తున్న టైఫూన్ పోడుల్...పోడుల్ పేరుకి అర్థం ఇదే...అసలు తుఫాను అంటే ఏమిటి..అసలు ఆయా తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు..?

తైవాన్‌ను ఇప్పుడు 'పోడుల్' అనే మధ్యస్థాయి తుఫాను అతలాకుతలం చేస్తోంది. ఆగ్నేయ తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుఫాను కారణంగా వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతంలో వచ్చిన తుఫానుల వల్ల ఏర్పడిన వరదలు, బలమైన గాలుల నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే ఈ తుఫాను రావడం ఆందోళన కలిగిస్తోంది.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤Lanthanide salts: ఇక పై లోహాలకు తుప్పు పట్టదు..ఇది సాధ్యమే అంటున్నారు నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకులు...అదెలాగ సాధ్యమో తెలుసుకోండి..!

నాగాలాండ్ యూనివర్సిటీ నేతృత్వంలో అంతర్జాతీయ పరిశోధనా బృందం అరుదైన ఎర్త్ సమ్మేళనమైన లాంతనైడ్ లవణాలను గుర్తించింది. ఇది పరిశ్రమలను తుప్పు పట్టకుండా కాపాడటానికి సహాయపడుతుంది.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤National Anti-Doping (Amendment) Bill-2025 : జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ

జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లు-2025 కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు భారతదేశంలో క్రీడా వ్యవస్థను మెరుగుపరచడం, డోపింగ్‌ను అరికట్టడం మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం వంటి కీలక లక్ష్యాలను కలిగి ఉంది.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి.. 


➤Reservations in India: అసలు రిజర్వేషన్లను ఏయే పరిమితుల ఆధారంగా ఇవ్వాలి..దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు గురించి ఎందుకింత చర్చ...అంబేద్కర్ ఆశయం నెరవేరేదెప్పుడు...?

సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లలో అంతర్గత ఆర్థిక పరిమితులు విధించాలనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పిటిషనర్ల వాదన ప్రకారం, సంపన్న కుటుంబాలకు చెందినవారికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రయోజనాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే చేరాలని వారు వాదిస్తున్నారు.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి.. 

➤Bombay High Court: ఆధార్, పాన్ కార్డు, ఓటరు ఐడీలు ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి భారత పౌరుడు కాలేడా..? అసలు భారత పౌరసత్త్వం పొందడానికి గల రూల్స్...తప్పక తెలుసుకోవాల్సిందే...!

ఆధార్, పాన్ కార్డు లేదా ఓటరు ఐడీ వంటి పత్రాలు ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి భారత పౌరుడు కాడని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చిన బాబు అబ్దుల్ రఫ్ సర్దార్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి.. 

 Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 12 Aug 2025 05:50PM

Photo Stories

News Hub