Collaborate With Invest India: స్టార్టప్లకు తోడ్పాటునిచ్చేందుకు ఇన్వెస్ట్ ఇండియాతో జట్టు కట్టిన సంస్థ?
Sakshi Education
దేశీయంగా టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా ఇన్వెస్ట్ ఇండియాతో చేతులు కలిపింది.
ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇన్వెస్ట్ ఇండియాలో భాగమైన యాక్సెలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ (అగ్ని మిషన్)తో మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కలిసి పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ ప్రోగ్రాం కోసం ఎంపికైన అంకుర సంస్థలకు మైక్రోసాఫ్ట్ సాంకేతికతలు (అజూర్, గిట్‌హబ్, ఎం365 మొదలైనవి) అందుబాటులో ఉంటాయి. స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికలను మెరుగుపర్చుకోవడం, విస్తరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇప్పటికే 11 అంకుర సంస్థలు మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కార్యక్రమంలో చేరాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్వెస్ట్ ఇండియాతో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : మైక్రోసాఫ్ట్ ఇండియా
ఎందుకు : దేశీయంగా టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్వెస్ట్ ఇండియాతో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : మైక్రోసాఫ్ట్ ఇండియా
ఎందుకు : దేశీయంగా టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు...
Published date : 26 Aug 2021 11:28AM