Skip to main content

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి ఆమోదం

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)-2019 బిల్లు(ఉపా)కు రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదం తెలిపింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం-1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)-2019 బిల్లు(ఉపా)కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రాజ్యసభ
Published date : 03 Aug 2019 05:39PM

Photo Stories