చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
Sakshi Education
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించేందుకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు డిసెంబర్ 12న రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును డిసెంబర్ 10వ తేదీనే లోక్‌సభ ఆమోదించింది. 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగిస్తారు. ఆంగ్లో-ఇండియన్ వర్గానికి మాత్రం ఈ పొడిగింపు ఇవ్వలేదు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : పార్లమెంటు
ఎందుకు : లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : పార్లమెంటు
ఎందుకు : లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించేందుకు
Published date : 13 Dec 2019 05:43PM