Skip to main content

చక్కెర పరిశ్రమకు రూ. రూ.3,500 కోట్ల సబ్సిడీ

ప్రస్తుత 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై <b>రూ.3,500 కోట్ల సబ్సిడీ</b>కి కేంద్ర కేబినెట్ డిసెంబర్ 16న ఆమోదం తెలిపింది.
Current Affairs ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2020 ఏడాది కూడా వార్షిక డిమాండ్ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

చైనా టెలికం పరికరాలకు చెక్
చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసే విధంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్ ప్రకటిస్తుంది. డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ జిబితాను రూపొందిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: చక్కెర పరిశ్రమకు రూ. రూ.3,500 కోట్ల సబ్సిడీ ఇచ్చందుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : చెరుకు రైతులకు మేలు కలిగించేందుకు
Published date : 17 Dec 2020 07:06PM

Photo Stories