Skip to main content

చిత్తూరులో ఐడీటీఆర్ కేంద్రం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ (ఐడీటీఆర్)’ కేంద్రం ఏర్పాటుకానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు ఐడీటీఆర్ కేంద్రాన్ని మంజూరుచేస్తూ జనవరి 30న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐడీటీఆర్ కేంద్రం ఏర్పాటుకు తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై నగరి మండలం తడుకు వద్ద 15ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేంద్రంలో చోదకులకు శిక్షణతోపాటు పరిశోధనలు చేపడతారు. ప్రకాశం జిల్లా దర్శిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐడీటీఆర్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐడీటీఆర్ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తడుకు, నగ రి మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 31 Jan 2019 05:40PM

Photo Stories