Skip to main content

చిట్‌ఫండ్స్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన ‘చిట్‌ఫండ్‌‌స(సవరణ) బిల్లు-2019’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
Current Affairsఈ బిల్లును నవంబర్ 28న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించగా, లోక్‌సభ నవంబర్ 20నే అంగీకారం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. చిట్ అమౌంట్‌ను ఇకపై గ్రాస్ చిట్ అమౌంట్ అని, డివిడెండ్‌ను షేర్ ఆఫ్ డిస్కౌంట్ అని, ప్రైజ్ అమౌంట్‌ను నెట్ చిట్‌ఫండ్ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్‌లకు మరింత గౌరవం కల్పించడం కోసం ‘సౌభ్రాతృత్వ నిధి’ (ఫ్రెటర్నిటీ ఫండ్) ‘చక్రీయ పొదుపు’ (రొటేటింగ్ సేవింగ్‌‌స), ‘రుణ సంస్థ’ (క్రెడిట్ ఇన్‌స్టిట్యూట్) అన్న పదాలు చేర్చినట్లు తెలిపారు. చిట్ పాడే వారికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా కలిగించనున్నట్టు చెప్పారు. చిట్ కంపెనీ యజమాని స్కీములకు అనుగుణంగా నిర్ణీత మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంచాల్సి ఉంటుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చిట్‌ఫండ్స్(సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : భారత పార్లమెంట్
Published date : 29 Nov 2019 05:43PM

Photo Stories