Skip to main content

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి ఏర్పాటుకు ఆమోదం

రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వనున్న ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ పదవి ఏర్పాటుకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది.
Current Affairsకార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సీడీఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీడీఎస్‌గా నియమితులయ్యే వారు నాలుగు నక్షత్రాలతో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని, త్రివిధ దళాధిపతులతో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు.

మరోవైపు సీడీఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు, బాధ్యతలపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికనూ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.

ప్రోటోకాల్ ప్రకారం...
సీడీఎస్ హోదా త్రివిధ దళాల అధిపతులకు సమానంగా ఉంటుందని, ప్రోటోకాల్ ప్రకారం ఆయన త్రివిధ దళాల కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని కేంద్ర ప్రభుత్వ అధికారులు వివరించారు. ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం అందుకు తగిన ఏర్పాట్లు చేయడం సీడీఎస్ ప్రధాన బాధ్యత.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదవి ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ
ఎందుకు : ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం కోసం
Published date : 25 Dec 2019 05:49PM

Photo Stories