చెన్నైలో ఎన్‌ఐఓటీ రజతోత్సవాలు ప్రారంభం
Sakshi Education
తమిళనాడు రాజధాని చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓటీ) రజతోత్సవాలు నవంబర్ 3న ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్‌ఐఓటీ రజతోత్సవ స్మారక స్టాంపును విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు మరింత సౌలభ్యాన్ని అందించేలా శాస్త్ర, సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓటీ) రజతోత్సవాలు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓటీ) రజతోత్సవాలు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
Published date : 04 Nov 2019 05:38PM