Skip to main content

చైనాను దాటనున్న భారత జనాభా

2027 నాటికి చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ఈ మేరకు ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019: హైలైట్స్’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం జూన్ 17న ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3కోట్లు పెరిగే అవకాశముంది.

ఐరాస నివేదికలోని అంశాలు....
  • ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా.. 2050 నాటికి రెండు బిలియన్లు పెరిగి 9.7 బిలియన్లకు చేరనుంది
  • ప్రపంచ జనాభా పెరుగుదలలో సగానిపైగా కేవలం 9 దేశాల్లోనే నమోదవుతుంది
  • రానున్న 30ఏళ్లలో భారత్‌తో పాటు నైజీరియా, పాకిస్థాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు, అమెరికాలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండనుంది
  • 143 కోట్ల మందితో చైనా, 137 కోట్ల మందితో భారత్ గత కొన్నేళ్లుగా అత్యధిక జనాభా గల దేశాలుగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 32.9కోట్ల మందితో యూఎస్‌ఏ, 27.1కోట్ల మందితో ఇండోనేషియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే 2050 తర్వాత భారత్ అగ్రస్థానంలోకి వస్తుందని, ఆ తర్వాత చైనా, నైజీరియా, యూఎస్‌ఏ, పాకిస్థాన్ అత్యధిక జనాభా గల మొదటి ఐదు దేశాలుగా ఉండనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2027 నాటికి చైనాను దాటనున్న భారత జనాభా
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : ఐక్యరాజ్యసమితి
Published date : 18 Jun 2019 05:38PM

Photo Stories