Skip to main content

చైనా రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్‌

క‌రోనా వైరస్‌ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఏప్రిల్ 21న రాష్ట్రాలను కోరింది.
Current Affairs

చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్‌ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్‌ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు.


5.4
శాతం మాత్రమే..
చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్‌ ప్రకటించింది. ఆ కిట్స్‌ ద్వారా జరిపిన పరీక్షల్లో 90 శాతం సరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తెలిపింది.

రాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్ కు ఆమోదం

ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(పీసీఆర్‌) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్‌ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5– 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్‌స్పాట్స్‌లో ఈ ర్యాపిడ్‌ టెస్టింగ్‌ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : చైనా రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్ వాడొద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)
ఎందుకు : ఆ కిట్స్‌ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో
Published date : 22 Apr 2020 06:53PM

Photo Stories