Skip to main content

చైనా గ్రాండ్‌ప్రి విజేతగా హామిల్టన్

చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
చైనాలోని షాంఘైలో ఏప్రిల్ 14న జరిగిన ఈ రేసులో హామిల్టన్ 56 ల్యాప్‌ల దూరాన్ని గంటా 32 నిమిషాల 06.350 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రేసులో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం పొందగా, ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం దక్కించుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి 2019, ఏప్రిల్ 28న జరగనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : షాంఘై, చైనా
Published date : 15 Apr 2019 05:44PM

Photo Stories