చారిత్రక కట్టడాలలో ప్లాస్టిక్ నిషేధం
Sakshi Education
దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల ప్రాంగణంలో, వాటికి 100 మీటర్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అనుమతించబోమని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ అక్టోబర్ 2న ప్రకటించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దేశం విడనాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న ప్రణాళికను కేంద్రప్రభుత్వం అర్ధంతరంగా ఆపివేసింది. నిషేధం విధిస్తే పరిశ్రమలకు విఘాతం కలుగుతుందని, ఆర్థిక మందగమనంతోపాటు ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశలోని చారిత్రక కట్టడాలలో ప్లాస్టిక్ నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశలోని చారిత్రక కట్టడాలలో ప్లాస్టిక్ నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్
Published date : 03 Oct 2019 05:38PM