Bharat series: ఏ పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి రానుంది?
Sakshi Education
తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త సిరీస్ 2021, సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం... కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదు. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, సెప్టెంబర్ 15 నుంచి భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్) పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ అమలు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా...

Published date : 30 Aug 2021 05:58PM