భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద నిర్మించే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు.
గురజాడ యూనివర్శిటీ, డిగ్రీ కళాశాల, పతంజలి ఆల్ట్రా మెగాఫుడ్ పార్క్, చందన ఇంటిగ్రేటింగ్ ఫుడ్‌పార్క్, ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ కేంద్రానికి కూడా ఇదే వేదిక నుంచి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎయిర్‌పోర్ట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని, ఎయిర్ పోర్టుకు అసైన్‌డ భూములిచ్చిన వారికి పరిహారం ఇస్తామని చెప్పారు. ఇచ్చాపురం నుంచి భోగాపురం మీదుగా విశాఖపట్నం వరకూ బీచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని, పేదల పెళ్లికి రూ. 35 వేలు ఇస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎక్కడ : దిబ్బలపాలెం, భోగాపురం మండలం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎక్కడ : దిబ్బలపాలెం, భోగాపురం మండలం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్
Published date : 15 Feb 2019 05:36PM