Skip to main content

భాషా పండితులకు రాష్ట్రపతి పురస్కారాలు

సంస్కృతం, పర్షియన్, అరబిక్, పాళీ, ప్రాకృతం, క్లాసికల్ తెలుగు, క్లాసికల్ కన్నడ, క్లాసికల్ మలయాళం, క్లాసికల్ ఒడియా భాషల అభివృద్ధికి కృషిచేసిన ఆయా భాషా పండితులకు స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారాలను ప్రకటించారు.
ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 15న వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను ఈ పురస్కరాలను ప్రకటించారు.

రాష్ట్రపతి పురస్కారాలు
శ్రీపాద సత్యనారాయణమూర్తి (సంస్కృతం)
ఆచార్య రవ్వా శ్రీహరి (క్లాసికల్ తెలుగు)

మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారం
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ (క్లాసికల్ తెలుగు)
డాక్టర్ వి.త్రివేణి (క్లాసికల్ తెలుగు)
డాక్టర్ కె.ప్రభాకర్ (క్లాసికల్ తెలుగు)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భాషా పండితులకు రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస్ సమ్మాన్ పురస్కారాలు
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎందుకు : భాషల అభివృద్ధికి కృషి చేసినందుకు
Published date : 16 Aug 2019 04:38PM

Photo Stories