Skip to main content

భారత్‌పై డబ్ల్యూటీవోకి ఈయూ ఫిర్యాదు

భారత్ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లఘించిందని పపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏప్రిల్ 2న ఫిర్యాదు చేసింది.
మొబైల్ ఫోన్స్‌ సహా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)కి సంబంధించిన కొన్ని ఉత్పత్తులపైభారత్ నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి సుంకాలను విధిస్తోందని ఈయూ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఐసీటీ ఉత్పత్తులపై సుంకాలను విధించబోమన్న హామీకి భారత్ కట్టుబడి ఉండాలని కోరుతున్నట్లు ఈయూ కమిషనర్ ఫర్ ట్రేడ్ సిసీలియా మామ్‌ో్టమ్ ్రపేర్కొన్నారు.

కరెంటు అకౌంటు లోటు పెరిగిపోకుండా దిగుమతులను కట్టడి చేసే క్రమంలో 2018, అక్టోబర్‌లో భారత ప్రభుత్వం కొన్ని కమ్యూనికేషన్స్‌ ఉత్పత్తులపై సుంకాలను 20 శాతం దాకా పెంచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌పై డబ్ల్యూటీవోకి ఫిర్యాదు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : యూరోపియన్ యూనియన్ (ఈయూ)
ఎందుకు : అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లఘించిందని
Published date : 03 Apr 2019 06:15PM

Photo Stories