Skip to main content

భారత్‌లో యూఎస్‌ఐడీఎఫ్‌సీ కార్యాలయం

భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ (యూఎస్‌ఐడీఎఫ్‌సీ) కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు.
Current Affairsఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్ వెల్లడించారు. ఆర్థికపరమైన సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు.

భారత్‌తో బలపడిన బంధం
భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌లో యూఎస్‌ఐడీఎఫ్‌సీ కార్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : భారత్
ఎందుకు : భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి
Published date : 28 Feb 2020 06:09PM

Photo Stories