Skip to main content

భారత్‌లో ఎన్‌టీటీ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి

జపాన్‌కి చెందిన టెక్ దిగ్గజం ఎన్‌టీటీ భారత్‌లో వచ్చే నాలుగేళ్లలో గణనీయంగా పెట్టుబడులు పెట్టనుంది.
Current Affairsఅంతర్జాతీయంగా నాలుగు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై దాదాపు 7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ సీఈవో (గ్లోబల్ డేటా సెంటర్స్ భారత విభాగం) శరద్ సంఘి జనవరి 22న తెలిపారు. ఇందులో 1.5 బిలియన్ డాలర్లు (రూ. 11,000 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ కొత్త ఆఫీస్
రేటింగ్‌‌స, అనలిటిక్స్, డేటా సేవల్లో ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. స్కైవ్యూ భవనంలో 2.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ఈ భవంతికి యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటెడ్ లీడ్ ధ్రువీకరణ ఉందని కంపెనీ తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ఎన్‌టీటీ
ఎక్కడ : భారత్
ఎందుకు : డేటా సెంటర్ల ఏర్పాటుకు
Published date : 23 Jan 2020 05:42PM

Photo Stories