Skip to main content

భారత్‌కు స్విస్ బ్యాంకు ఖాతాదారుల జాబితా

స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం అక్టోబర్ 7న భారత్‌కు అందజేసింది.
2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని స్విస్ ప్రభుత్వం తెలిపింది. రెండో జాబితాను 2020 సెప్టెంబర్‌లో అందజేస్తామని పేర్కొంది.

ఎఫ్‌టీఏలో భారత్ సభ్యత్వం
అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్‌టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌కు స్విస్ బ్యాంకు ఖాతాదారుల జాబితా
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : స్విట్జర్లాండ్ ప్రభుత్వం
Published date : 09 Oct 2019 06:07PM

Photo Stories