భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
Sakshi Education
అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు మొదటి దఫా అందాల్సిన నాలుగు చినూక్ సైనిక హెలికాప్టర్లు భారత్కు చేరాయి.
గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి ఫిబ్రవరి 10న చేరిన నాలుగు సీహెచ్47ఎఫ్(ఐ) రకం హెలికాప్టర్లను త్వరలోనే చండీగఢ్ ఐఏఎఫ్ స్థావరానికి తరలిస్తామని బోయింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్ హెలికాప్టర్లను భారత్కు బోయింగ్ సమకూర్చాల్సి ఉంది. బలగాలను, సైనిక సామగ్రిని, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఈ హెలికాప్టర్లు ఎంతో అనుకూలమైనవి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : బోయింగ్ సంస్థ
ఎక్కడ : ముంద్రా నౌకాశ్రయం, గుజరాత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : బోయింగ్ సంస్థ
ఎక్కడ : ముంద్రా నౌకాశ్రయం, గుజరాత్
Published date : 11 Feb 2019 05:15PM