Skip to main content

భారతీయుల సగటు ఆయుష్షు 69.4 ఏళ్లు

సాక్షి, హైదరాబాద్: భారతీయుల సగటు ఆయుర్దాయం 69.4 ఏళ్లు. పుట్టిన సమయంలో ఈ మేరకు జీవితకాలాన్ని ఆశించొచ్చు.
Current Affairs
పురుషుల కంటే మహిళలు, గ్రామీణుల కంటే పట్టణ ప్రజలు అధికకాలం జీవిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే సగటున పురుషులకు 68.7 ఏళ్లు, మహిళలకు 70.7 ఏళ్ల ఆయుర్దాయం ఉంటోంది. పట్టణ ప్రాంత ప్రజలకు 72.6 ఏళ్లు, గ్రామీణులకు 68 ఏళ్ల సగటు జీవితకాలం ఉంటోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్షు 69.6 ఏళ్లు కాగా, ఇక్కడి మహిళలు 70.8 ఏళ్లు, పురుషులు 68.6 ఏళ్లు జీవిస్తున్నారు. నమూనా రిజిస్ట్రేషన్ విధానం (ఎస్‌ఆర్‌ఎస్) ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా 2014-18కి సంబంధించిన సంక్షిప్త ఆయుష్షు పట్టికలను జనగణన కమిషనర్, డెరైక్టర్ జనరల్ కార్యాలయం తాజాగా ప్రకటించింది. దేశం, రాష్ట్రాలు, లింగాల వారీగా సగటు ఆయుష్షు పట్టిక (లైఫ్ టేబుల్స్)లు ఇందులో ఉన్నాయి. వేర్వేరు వయస్సు గల సమూహాల మనుగడ, మరణాల సంభావ్యతను ఈ నివేదిక అంచనా వేసింది. దేశంలోనే అత్యధికంగా ఢిల్లీ పురుషులు 73.8 ఏళ్లు, కేరళ మహిళలు 77.9 ఏళ్లు బతుకుతున్నారు. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ పురుషులు 63.7 ఏళ్లు, ఉత్తరప్రదేశ్ మహిళలు 65.8 ఏళ్ల సగటు ఆయుష్షును కలిగి ఉన్నారు. దేశంలో 60 ఏళ్లు దాటిన వయోజనులు మరో 18.2 ఏళ్ల జీవితాన్ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. పురుషులు మరో 17.4 ఏళ్లు, మహిళలు మరో 18.9 ఏళ్ల ఆయుర్దాయాన్ని ఆశించొచ్చు. పుట్టిన తొలి ఏడాది బతికిబట్టకట్టితే, పురుషులు 69.8 ఏళ్లు, మహిళలు 72.5 ఏళ్ల ఆయుష్షును ఆశించవచ్చు.

గత
4 దశాబ్దాల్లో పెరిగిన ఆయుష్షు..
గత నాలుగు దశాబ్దాల్లో భారతీయుల ఆయుష్షు గణనీయంగా పెరిగింది. సమయం గడిచిన కొద్దీ జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య సదుపాయాల అభివృద్ధికి తగ్గట్టు ఆయుష్షు క్రమంగా పెరుగుతోంది. 1970-75 మధ్య కాలంలో 49.7 ఏళ్లు మాత్రమే ఉన్న భారతీయుల సగటు ఆయుర్దాయం... 2014-18 మధ్య కాలం నాటికి 19.7 ఏళ్లు పెరిగి 69.4 ఏళ్లకు చేరింది. 1970-75 మధ్యకాలంలో మహిళల ఆయుష్షు 49 ఏళ్లు, పురుషుల ఆయుష్షు 50.5 ఏళ్లు కాగా, 2014-18 నాటికి వరుసగా 70.7 ఏళ్లు, 68.7 ఏళ్లకు పెరిగింది.

గత నాలుగు దశాబ్దాల్లో పెరుగుదల (ఆయుష్షు ఏళ్లల్లో) ..

కాల వ్యవధి

పురుషులు

మహిళలు

సగటు ఆయుష్షు

1970-75

50.5

49

49.7

1976-80

52.5

52.1

52.3

1981-85

55.4

55.7

55.4

1986-90

57.7

57.7

58.1

1991-95

59.7

60.9

60.3

1996-2000

61.2

62.7

61.9

2001-05

63.1

65.6

64.3

2006-10

64.6

67.7

66.1

2013-17

67.8

70.4

69

2014-18

68.2

70.7

69.4

తగ్గుతున్న పట్టణ- గ్రామీణ వ్యత్యాసం..
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రజల ఆయుర్దాయం మధ్య 1970-75 కాలంలో 10 ఏళ్ల వ్యత్యాసం ఉండగా, 2014-18 నాటికి ఇది 4.6 ఏళ్లకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు, వైద్య సదుపాయాలు వృద్ధి చెందడంతో పిన్న వయసులో మరణాలు తగ్గాయి. అయినా కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా పట్టణ ప్రజలతో పోల్చితే గ్రామీణుల ఆయుష్షు కొంత వరకు తక్కువగానే ఉంది.

ఏ వయస్సు వారు ఇంకెంత కాలం..?
జాతీయస్థాయిలో 70 ఏళ్ల వయస్సువారు మరో 11.6 ఏళ్ల జీవితకాలాన్ని ఆశించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. తెలంగాణలో అయితే మరో 11 ఏళ్ల ఆయుష్షును ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఏ వయస్సుల వారు మరెంత ఆయుష్షును ఆశించవచ్చో ఈ కింది పట్టికలో చూడవచ్చు.

వయస్సు

ఆయుష్షు (ఏళ్లల్లో)

 

భారతదేశం

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

0

69.4

69.6

70

1

71.1

70.9

71.1

5

67.5

67.1

67.4

10

62.7

62.5

62.2

20

53.1

52.6

52.8

30

43.7

43.2

43.4

40

34.6

34.1

34.3

50

25.8

25.6

25.9

60

18.2

17.7

18.4

70

11.6

11

12


2014-18 సర్వే ప్రకారం రాష్ట్రాల వారీగా ఆయుష్షు (ఏళ్లల్లో)..

రాష్ట్రం

సగటు

పురుషులు

మహిళలు

ఏపీ

70.0

68.7

71.4

అస్సాం

66.9

66.1

67.9

బిహార్

69.1

69.4

68.7

ఛత్తీస్‌గఢ్

65.2

63.7

66.6

ఢిల్లీ

75.3

73.8

77.0

గుజరాత్

69.9

67.8

72.3

హరియాణా

69.8

67.7

72.3

హిమాచల్ ప్రదేశ్

72.9

69.6

76.8

జమ్మూకశ్మీర్

74.0

72.2

76.2

జార్ఖండ్

69.1

69.9

68.5

కర్ణాటక

69.4

67.9

70.9

కేరళ

75.3

72.5

77.9

మధ్యప్రదేశ్

66.5

64.8

68.5

మహారాష్ట్ర

72.5

71.3

73.8

ఒడిశా

69.3

68.0

70.8

పంజాబ్

72.7

71.0

74.8

రాజస్తాన్

68.7

66.5

71.6

తమిళనాడు

72.1

70.2

74.2

తెలంగాణ

69.6

68.6

70.8

ఉత్తరప్రదేశ్

65.3

64.8

65.8

ఉత్తరాఖండ్

70.9

67.9

74.3

పశ్చిమబెంగాల్

71.6

70.7

72.6

Published date : 27 Oct 2020 05:35PM

Photo Stories