Skip to main content

భారతీయ పౌరసత్వం వదులుకున్న చోక్సీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని రూ.వేల కోట్ల మేర మోసగించి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు.
ప్రస్తుతం ఆంటిగ్వాలో ఆశ్రయం పొందుతున్న చోక్సీ జనవరి 21న గయానాలోని భారత రాయబార కార్యాలయంలో తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాడు. రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత చట్టాల ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారతీయ పౌరసత్వం వదులుకున్న వజ్రాల వ్యాపారి
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : మెహుల్ చోక్సీ
Published date : 22 Jan 2019 05:25PM

Photo Stories