Skip to main content

భారత్ వృద్ధి రేటు 6.6 శాతమే: ఫిచ్

2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 6.6 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది.
తొలుత 7 శాతంగా ఉన్న ఈ అంచనాలను మార్చిలో 6.8 శాతానికి తగ్గించిన ఫిచ్ తాజాగా 6.6 శాతానికి కుదించింది. గత ఏడాది కాలంగా తయారీ, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు తమ తాజా అంచనాలకు కారణమని జూన్ 17న విడుదల చేసిన తన తాజా నివేదికలో ఫిచ్ పేర్కొంది.

ఫిచ్ తాజా నివేదికలోని అంశాలు..
  • 2020-2021లో భారత్ వృద్ధి 7.1 శాతానికి చేరుతుంది. అయితే 2021-2022లో ఈ రేటు 7 శాతానికి దిగివస్తుంది.
  • అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయ పరిస్థితులూ భారత్ వృద్ధి మందగమనానికి కారణమవుతున్నాయి. ఎగుమతుల పెరుగుదలా ఇటీవలి కాలంలో పేలవంగా ఉంది.
  • అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ పెట్టుబడులపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇది ప్రతికూలాంశం.
  • 2020 వృద్ధి రేటును ఇంతక్రితం 2.8 శాతంగా అంచనావేసినా తాజాగా 2.7 శాతానికి కుదిస్తున్నాం.
  • చైనా వృద్ధి రేటు అంచనా కూడా 6.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నాం. అమెరికా వృద్ధి రేటు అంచనా కూడా 1.9 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గిస్తున్నాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్ వృద్ధి రేటు 6.6 శాతమే
ఎప్పుడు : 2019-2020లో
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్
Published date : 18 Jun 2019 05:29PM

Photo Stories