Skip to main content

భారత్ వృద్ధి రేటు 5.2 శాతామే: ఎస్ అండ్ పీ

భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది.
Current Affairsక్యాలెండర్ ఇయర్‌లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది.

చైనా వృద్ధి రేటు 2.9 శాతం
2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదిస్తున్నట్లు ఎస్ అండ్ పీ తెలిపింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని అభిప్రాయపడింది. మరోవైపు ఆసియా-పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020లో భారత్ వృద్ధి రేటు 5.2 శాతామే
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ
ఎందుకు : కోవిడ్-19 కారణంగా
Published date : 19 Mar 2020 05:35PM

Photo Stories