భారత వృద్ధి రేటు 1.5 శాతమే: ప్రపంచ బ్యాంకు
Sakshi Education
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు గణనీయంగా మందగించనుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
2020–21లో ఇది 1.5–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే, 1991లో ఆర్థిక సంరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాల్లో వృద్ధి రేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 4.8–5 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాలు తగ్గే కొద్దీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ పుంజుకోగలదన్నది బ్యాంక్ అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–21లో భారత వృద్ధి రేటు 1.5–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎందుకు : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–21లో భారత వృద్ధి రేటు 1.5–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎందుకు : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో
Published date : 13 Apr 2020 06:07PM