Skip to main content

భారత్ తరపున తొలి ఆస్కార్ అందుకున్న ప్రముఖ డిజైనర్ కన్నుమూత

భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆమె అక్టోబర్ 15న ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు.
Edu newsమహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించిన భాను అతైయా... 1956లో హిందీచిత్రం ‘సి.ఐ.డి’తో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. సుమారు వంద సినిమాలకుపైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.

గాంధీ చిత్రానికి...
1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా భాను పని చేశారు. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డులను అందుకున్నారు.

కాస్ట్యూమ్ డిజైన్ పుస్తకం...
భాను రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అని ఆమె అన్నారు. 2004లో ‘స్వదేశ్’ తర్వాత భాను సినిమాలు చేయలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : భాను అతైయా (91)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్య కారణాలతో
Published date : 16 Oct 2020 06:18PM

Photo Stories