భారత రక్షణ స్థావరంపై తొలి డ్రోన్ ఉగ్రదాడి ఎక్కడ జరిగింది?
Sakshi Education
జమ్మూలోని భారత వైమానిక దళ (ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ ఉగ్రదాడి జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత రక్షణ స్థావరంపై తొలి డ్రోన్ ఉగ్రదాడి
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాదులుఎక్కడ : భారత వైమానిక దళ (ఐఏఎఫ్) స్థావరం, జమ్మూ&కశ్మీర్
పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాదులు భారత కీలక రక్షణ స్థావరాలపై డ్రోన్ దాడికి తెగబడడం ఇదే తొలిసారి. జమ్మూ విమానాశ్రయంలోని ఐఏఎఫ్ స్టేషన్‌పై జూన్ 27న ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండ బాంబులను జారవిడిచారు. ఈ బాంబు దాడిలో ఇద్దరు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు. మొదటి బాంబు దాడిలో ఐఏఎఫ్ స్టేషన్ పై కప్పు ధ్వంసం కాగా, రెండో బాంబు నేలపై పడి పేలింది.
బాంబులను జారవిడిచిన తరువాత డ్రోన్లు తిరిగి సరిహద్దు దాటి వెళ్లడమో, లేక మరో రహస్య ప్రదేశానికి వెళ్లడమో జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జమ్మూ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సరిహద్దు 14 కి.మీల దూరంలో ఉంది.
21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు...
బాంబులను జారవిడిచిన తరువాత డ్రోన్లు తిరిగి సరిహద్దు దాటి వెళ్లడమో, లేక మరో రహస్య ప్రదేశానికి వెళ్లడమో జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జమ్మూ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సరిహద్దు 14 కి.మీల దూరంలో ఉంది.
21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు...
- అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), వీటినే సింపుల్‌గా డ్రోన్లు అని పిలుస్తారు.
- ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు ఉన్నట్టుగా అమెరికాకి చెందిన బార్డ్ కాలేజీ సెంటర్ ఫర్ స్టడీ ఆన్ డ్రోన్స్ అంచనా
- పదేళ్ల క్రితం 60 దేశాల్లో మిలటరీ డ్రోన్లు ఉంటే ఇప్పుడు ఈ దేశాల సంఖ్య 95కి పెరిగింది.
- కదన రంగంలో వినియోగించే డ్రోన్లు ప్రస్తుతం 171 రకాలు ఉన్నాయి
- అమెరికా ఇజ్రాయెల్, యూకే, రష్యా, టర్కీ వంటి దేశాల తర్వాత పాకిస్తానే అత్యధికంగా మిలటరీ డ్రోన్లను వినియోగిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాక్ వాడుతోంది.
- ఇతర దేశాలకు డ్రోన్లను ఇజ్రాయెల్ అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ వరకు గత ఎనిమిదేళ్లలో 460 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లను ఆ దేశం ఎగుమతి చేసింది.
- మొట్టమొదటిసారిగా 1982లో సిరియా వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడి చేసింది.
- ఇటీవల కాలంలో సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై యెమన్‌కి చెందిన హౌతి ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు జరిపితే, ఇరాన్‌పై అమెరికా డ్రోన్లతోనే దాడులు సాగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత రక్షణ స్థావరంపై తొలి డ్రోన్ ఉగ్రదాడి
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాదులు
Published date : 28 Jun 2021 01:37PM