Skip to main content

భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే : ఏడీబీ

భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది.
Current Affairs అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు 2019 అప్‌డేటెడ్ ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్‌ను డిసెంబర్ 11న ఏడీబీ విడుదల చేసింది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని ఏడీబీ తన అవుట్‌లుక్‌లో విశ్లేషించింది.

రెండవసారి కోత...
2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :2019 భారత్ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
Published date : 12 Dec 2019 06:28PM

Photo Stories