Skip to main content

భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే: ఫిచ్

భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ మార్చి 2న ప్రకటించింది.
Current Affairs2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, కరోనా వైరస్ కారణంగా సరఫరా పరంగా అడ్డంకులతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు ఫిచ్ పేర్కొంది.
 
 5.1 శాతానికి కుదింపు: ఓఈసీడీ
 కోవిడ్ 19(కరోనా వైరస్) రిస్క్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. గతంలో ఇది 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక మార్కెట్లు, పర్యాటక రంగం, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు మొదలైన అంశాల వల్ల జీ20 దేశాల వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది.

క్విక్ రివ్యూ   :
 ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే
 ఎప్పుడు  : మార్చి 2
 ఎవరు  : ఫిచ్ సొల్యూషన్స్ 
 ఎందుకు : తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నందున
Published date : 03 Mar 2020 05:56PM

Photo Stories