భారత హాకీ జట్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతోంది?
భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. ఆగస్టు 17న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఇరు జట్లను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు స్పాన్సర్‌షిప్ చేస్తామని చెప్పారు.ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షలు అందించింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ‘టీమ్ స్పాన్సర్’గాఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.
అఫ్గనిస్తాన్‌క్రికెట్‌జట్టు కోచ్‌గా నియమితులైన శ్రీలంక ఆటగాడు?
తాలిబాన్ల సమస్యతో అట్టుడుకున్న తమ దేశంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా శ్రీలంక మాజీ ఆటగాడు అవిష్కగుణవర్ధనేను నియమించింది. గుణవర్ధనే శ్రీలంక జట్టు తరఫున 6 టెస్టులు, 61 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టి10 టోర్నీ సందర్భంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుణవర్ధనేను ఐసీసీ 2021, మే నెలలోనే నిర్దోషిగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :భారతహాకీ జట్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతోంది?
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు : ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలో క్రీడలను ప్రోత్సహించేందుకు...