భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో హసీనా
Sakshi Education
దేశరాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 4న జరిగిన భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ... ‘మీరు (భారత్) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి పీయూష్ మాట్లాడుతూ.. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 05 Oct 2019 05:40PM