Skip to main content

భారత అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రాజీనామా

భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ వోల్కర్ హెర్మన్ తన పదవి నుంచి తప్పుకున్నారు.
Current Affairs
ఈ విషయాన్ని వోల్కర్ నవంబర్ 22న తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలిపారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో వోల్కర్ ఈ బాధ్యతను స్వీకరించారు. 2024 వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ ముందుగానే రాజీనామా చేశారు. ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడిగా ఆదిల్ సుమరివాలా ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఏఎఫ్‌ఐ హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : వోల్కర్ హెర్మన్
ఎందుకు : పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని
Published date : 23 Nov 2020 06:02PM

Photo Stories