Skip to main content

బయో ఏషియా–2021 సదస్సు థీమ్ ఏమిటి?

కోవిడ్–19 ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22న 18వ బయో ఆసియా సదస్సు–2021 ప్రారంభమైంది. కరోనా కారణంగా వివిధ దేశాల ప్రతినిధులు వర్చువల్ విధానం ద్వారా సదస్సులో పాల్గొంటున్నారు.
Current Affairs
రెండు రోజుల పాటు ఫిబ్రవరి 23 వరకు జరిగే ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లైఫ్‌ సెన్సైస్‌ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాల గురించి మంత్రి వివరించారు.

బయో ఏషియా–2021 సదస్సు థీమ్‌: మూవ్‌ ది నీడిల్‌

ముఖ్యాంశాలు...
  • 18వ బయో ఏషియా వార్షిక సదస్సు ఎజెండా కోవిడ్‌– 19 కేంద్రంగా ఉంది.
  • తెలంగాణ రాష్ట్ర లైఫ్‌ సెన్సైస్‌ సలహామండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.
  • ప్రస్తుతం బయో ఏషియా సీఈఓగా శక్తి నాగప్పన్‌ ఉన్నారు.
  • సుమారు 50 దేశాలకు చెందిన 1500 మంది నిపుణులు సదస్సులో పాల్గొంటున్నారు.
  • కరోనా నేపథ్యంలో సదస్సును తొలిసారిగా వర్చువల్‌ విధానంలో నిర్వహించనున్నారు.

భారత్‌ బయోటెక్‌కు అవార్డు...
బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు 2021 ఏడాది భారత్‌ బయోటెక్‌కు దక్కింది. అవార్డును భారత్‌ బయోటెక్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్‌ అందించారు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌తో పాటు పలు ఇతర టీకాలను భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : బయో ఏషియా–2021 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : వర్చువల్‌ విధానంలో
ఎందుకు : లైఫ్‌ సెన్సైస్‌ రంగానికి ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలను చర్చించేందుకు
Published date : 23 Feb 2021 06:00PM

Photo Stories