బ్యాడ్మింటన్‌కు లీ జురుయ్ వీడ్కోలు
Sakshi Education
చైనీస్ బ్యాడ్మింటన్ దిగ్గజం లీ జురుయ్ తన బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.
లండన్ ఒలింపిక్స్ చాంపియన్ అయిన ఆమె గాయం తర్వాత పూర్తిస్థాయిలో కోలుకోలేదు. 2012లో ఆమె ఒలింపిక్స్‌తో పాటు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది. 2013, 2014లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అక్కడ గాయపడిన ఆమె ఆ తర్వాత కెరీర్‌నే ఇలా ముగించాల్సి వచ్చింది. తన అంతర్జాతీయ కెరీర్‌లో లీ జురుయ్ 14 సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచింది. 2013లో బీడబ్ల్యూఎఫ్ మహిళా ప్లేయర్ అవార్డును గెలుచుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : లీ జురుయ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : లీ జురుయ్
Published date : 18 Oct 2019 05:30PM