బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ?
Sakshi Education
బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : ఆన్‌లైన్
ఎందుకు : ఆర్థికాంశాల్లో అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిపేందుకు
ఏప్రిల్ 6న జరిగిన ఈ సమాశంలో నిర్మలా మాట్లాడుతూ... విధానపరమైన మద్దతుకుతోడు, అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడం ద్వారా బ్రిక్స్ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
భారత్ అధ్యక్షతన బ్రిక్స్...
2021లో బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. భారత్ నేతృత్వంలో 2021 ఏడాది ఇదే మొదటి బ్రిక్స్ సమావేశం. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని ఇనుమడింపచేయడం, ఏకాభిప్రాయం కోసం భారత్ పనిచేస్తుందని భారత ఆర్థిక శాఖ తెలిపింది.
బ్రిక్స్ గురించి...

- బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా–ఆఖఐఇ ) అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి.
- బ్రిక్స్ దేశాలు 2009 నుంచి ఏటా సమావేశమవుతూ ఆర్థికం, వాణిజ్యం వంటి అనేకాంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి.
- మొదట బ్రిక్ (BRIC) గా ఏర్పడిన ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో BRICS గా మారింది.
- గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా బ్రిక్ అనే పదాన్ని వాడారు.
- బిక్స్ కూటమి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ఏంతో ప్రాధాన్యం కలిగి ఉంది.
- 360 కోట్ల జనాభాకు బ్రిక్స్ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగం. ఈ ఐదు దేశాల మొత్తం జీడీపీ 16.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : ఆన్‌లైన్
ఎందుకు : ఆర్థికాంశాల్లో అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిపేందుకు
Published date : 07 Apr 2021 06:30PM