బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం
Sakshi Education
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది.
ఫిక్సింగ్ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై చర్య తీసుకున్నట్లు ఐసీసీ అక్టోబర్ 29న ప్రకటించింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబ్‌ను బుకీ సంప్రదించాడు. తాజా పరిణామంలో షకీబ్ భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్‌సలో 3వ (టెస్టు), 1వ (వన్డే), 2వ (టి20) స్థానాల్లో షకీబ్ కొనసాగుతున్నాడు.
షకీబ్ ఆటకు దూరమైన నేపథ్యంలో భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టు జట్టుకు మోమినుల్ హక్, టి20 జట్టుకు మహ్ముదుల్లా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
షకీబ్ ఆటకు దూరమైన నేపథ్యంలో భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టు జట్టుకు మోమినుల్ హక్, టి20 జట్టుకు మహ్ముదుల్లా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై రెండేళ్ల నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
ఎందుకు : ఫిక్సింగ్ చేసేందుకు షకీబ్‌ను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్ సమాచారం ఇవ్వకపోవడంతో
Published date : 30 Oct 2019 05:36PM