బీసీసీఐ ఎలక్టోరల్ అధికారిగా గోపాలస్వామి
Sakshi Education
బీసీసీఐ ఎలక్టోరల్ అధికారిగా ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎన్. గోపాలస్వామి నియమితులయ్యారు.
బీసీసీఐ ఎన్నికల విధివిధానాలపై జూన్ 7న చర్చించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఈ మేరకు వెల్లడించింది. రాష్ట్ర సంఘాలకు సెప్టెంబర్ 24న ఎన్నికలు జరుగనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 22న వార్షిక సర్యసభ్య సమావేశంలో జరుగనున్న బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలకు గోపాలస్వామి ఎలక్టోరల్ అధికారిగా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీసీసీఐ ఎలక్టోరల్ అధికారి నియామకం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఎన్. గోపాలస్వామి
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీసీసీఐ ఎలక్టోరల్ అధికారి నియామకం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఎన్. గోపాలస్వామి
Published date : 08 Jun 2019 06:21PM