Skip to main content

బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత?

కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్(82) కన్నుమూశారు.
Current Affairs
చాన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 27న గుండెపోటుతో న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 27న ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. జశ్వంత్ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను సమర్థంగా నిర్వహించారు.

రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ
1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా- ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్(82)
ఎక్కడ : ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి, న్యూ ఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 29 Sep 2020 01:21PM

Photo Stories