Skip to main content

బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాకేశ్‌ ఆస్తానా

సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా గుజరాత్‌ కేడర్‌ 1984 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ ఆస్తానా నియమితులయ్యారు.
Current Affairs
ఆస్తానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (బీసీఏఎస్‌) సెక్యూరిటీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. 2021 జులై 31 వరకూ బీఎస్‌ఎఫ్‌ డీజీగా ఆస్తానా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 17న తెలిపింది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ దగ్ధం వంటి హైప్రొఫైల్‌ కేసులను ఆస్తానా విచారించారు. 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలోఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఆయన అరెస్ట్‌ చేశారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా రాకేష్‌ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో​ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఓ మనీల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బీఎస్‌ఎఫ్‌ బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : రాకేశ్‌ ఆస్తానా
Published date : 18 Aug 2020 04:39PM

Photo Stories