బీబీసీ 100 మహిళలు-2020
Sakshi Education
ప్రముఖ వార్త సంస్థ బీబీసీ... ప్రతి ఏడాదిలాగే 2020 సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో ఒక జాబితాను రూపొందించింది.
‘బీబీసీ 100 మహిళలు-2020’ పేరుతో నవంబర్ 24న ఈ జాబితాను విడుదల చేసింది. ప్రపంచమంతా ఒడిదొడుకులు నెలకొన్న ఈ సమయంలో మార్పుకు దారి చూపుతూ ముందుకు సాగుతున్న మహిళలకు ప్రాధాన్యమిస్తూ ఈ జాబితాను బీబీసీ రూపొందించింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ ప్రధాని 35 ఏళ్ల సనా మారిన్‌తో పాటు నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే (12) ఈ జాబితాలో చోటు సంపాదించారు.
బిల్కిస్ (బానో) దాది...
ప్రధాని మోదీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తదితరులతో పాటు 2020 ఏడాది ‘టైమ్’ మ్యాగజైన్ చోటిచ్చిన 100 మంది శక్తిమంతుల జాబితాలో కూడా 82 ఏళ్ల బిల్కిస్ దాదీ ఉన్నారు. భారత ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన మహిళల బైఠాయింపు ప్రదర్శనలో పాల్గొన్నారు. గడ్డ కట్టించే చలిలో స్ఫూర్తిమంతమైన మాటలు చెబుతూ షహీన్‌బాగ్ నిరసనకు ఉద్యమరూపం తెచ్చారు. ఆ ప్రేరణతో దేశంలో మిగతాచోట్ల కూడా షహీన్‌బాగ్ తరహా మహిళా ఉద్యమాలు తలెత్తాయి.
గానా ఇసైవాణి...
‘గానా’ అనేది ఒక ఆలాపన ధోరణి. అందులో పురుషుల స్వరాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. చెన్నై అమ్మాయి ఇసైవాణి గానాలో పట్టుసాధించి పురుష గాయకులకు దీటుగా నిలిచింది. పోటీ ఇచ్చింది. ప్రజాదరణ పొందింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ‘గానా’ పాటలు పాడేందుకు ముందుకు వచ్చారు.
మానసీ జోషి...
పారా అథ్లెట్. బ్యాడ్మింటన్‌లో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్. అంగవైకల్యం, పారా క్రీడల విషయంలో భారతీయుల వైఖరిని సానుకూలంగా మార్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు. మానసీ జోషీ రాజ్‌కోట్ యువతి. ఇంజినీరింగ్ చదివారు. ఇటీవలే ‘టైమ్’ మ్యాగజీన్ ప్రకటించిన ‘నెక్స్ట్ జనరేషన్ లీడర్’ జాబితాలోనూ మానసీ ఉన్నారు.
రిధిమా పాండే...
ఉత్తరాఖండ్‌కి చెందిన రిధిమా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవలసిన అవసరం గురించి తెలియజేస్తూ... ప్రపంచ వ్యాప్తంగా అనేక చైతన్య సదస్సులలో పాల్గొంది. వాతావరణ మార్పుల విషయంలో భారత ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తో తొమ్మిదేళ్ల వయసులోనే రిధిమ ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో పిటిషన్ వేసింది. గత ఏడాది గ్రెటా థన్‌బెర్గ్, ఇతర బాల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కమిటీలో ఫిర్యాదు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీబీసీ 100 మహిళలు-2020 జాబితాలో నలుగురు భారతీయులు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే (12)
ఎందుకు : స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచినందుకు

Published date : 28 Nov 2020 06:01PM