బీఐఆర్‌ఏసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫార్మా సంస్థ?
Sakshi Education
కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఫార్మా సంస్థ అరబిందో సెప్టెంబర్ 15న వెల్లడించింది.
యూఎస్‌లోని సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ ‘ఆరో వ్యాక్సిన్స్’ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తోంది. నేషనల్ బయోఫార్మా మిషన్‌లో భాగంగా బయోటెక్నాలజీ శాఖకు చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి అరబిందోకు మద్దతుగా నిలిచింది. దేశ అవసరాల కోసం మహమ్మారితో పోరాటంలో భాగంగా వ్యాక్సిన్‌కై అరబిందో ఫార్మాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు బీఐఆర్‌ఏసీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీఐఆర్‌ఏసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫార్మా సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : అరబిందో ఫార్మా
ఎందుకు : కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీఐఆర్‌ఏసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫార్మా సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : అరబిందో ఫార్మా
ఎందుకు : కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి
Published date : 16 Sep 2020 05:25PM