Skip to main content

బెస్ట్‌ సిటీ కేటగిరీలో హైదరాబాద్‌కు మొదటి స్థానం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌–2020 ర్యాంకుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు పట్టణాలు వివిధ కేటగిరీల్లో ర్యాంకులు సాధించాయి.
Current Affairs
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన ఈ సర్వే ఫలితా లను ఆగస్టు 20న స్వచ్ఛ మహోత్సవ్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. 40 లక్షలకు పైబడిన జనాభా కలిగిన పట్టణాల్లో హైదరాబాద్‌ ‘బెస్ట్‌ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్‌’ లకేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక జాతీయ స్థాయిలో ‘బెస్ట్‌ సిటిజన్ లెడ్‌ ఇనిషియేటివ్‌ కేటగిరీ’లో కరీంనగర్‌ అగ్రస్థానం సాధిం చింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన పట్టణాల్లో దక్షిణాదిలో ‘బెస్ట్‌ ఫాస్టెస్ట్‌ మూవర్‌ సిటీ’గా జహీరాబాద్‌ నిలిచింది.

క్లీన్ సిటీగా మేడ్చల్‌..
దక్షిణాదిలో 25వేల నుంచి 50వేల జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో క్లీన్ సిటీగా మేడ్చల్‌ మున్సిపాలిటీకి ప్రథమ స్థానం దక్కింది. లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో జాతీయ స్థాయిలో కరీంనగర్‌ 72, నిజామాబాద్‌ 133వ స్థానంలో నిలిచాయి. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో జోనల్‌ స్థాయిలో సిరిసిల్ల 16, సిద్దిపేట 27, జహీరాబాద్‌ 31, గద్వాల 38, బోడుప్పల్‌ 42, వనపర్తి 51వ స్థానాల్లో నిలిచాయి. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో హుజూర్‌ నగర్‌ 9, షాద్‌నగర్‌ 15, మెదక్‌ 24, కల్వకుర్తి 26వ స్థానం సాధించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బెస్ట్‌ సిటీ కేటగిరీలో హైదరాబాద్‌కు మొదటి స్థానం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌–2020 ర్యాంకులు
ఎక్కడ : దేశంలో
Published date : 26 Aug 2020 12:22PM

Photo Stories