Skip to main content

బాయ్‌కాట్, స్ట్రాస్‌కు నైట్‌హుడ్ పురస్కారం

ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజాలు జెఫ్రీ బాయ్‌కాట్, ఆండ్రూ స్ట్రాస్ లకు బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ పురస్కారాన్ని సెప్టెంబర్ 10న ప్రకటించింది.
ఇంగ్లండ్ క్రికెట్‌కు వీరు అందించిన సేవలకు గాను ఆ దేశ మాజీ ప్రధాని థెరిసా మే ‘సర్’ బిరుదును ప్రదానం చేయనున్నారు. నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకున్న వారు తమ పేరుకు ముందు ‘సర్’ పెట్టుకునే అవకాశం ఉంటుంది. 78 ఏళ్ల బాయ్‌కాట్ (1964-1982) 108 టెస్టుల్లో 22 సెంచరీలతో 8,114 పరుగులు చేశాడు. 42 ఏళ్ల స్ట్రాస్ (2004-2012) 100 టెస్టులాడి 21 సెంచరీలతో 7,037 పరుగులు సాధించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జెఫ్రీ బాయ్‌కాట్, ఆండ్రూ స్ట్రాస్ లకు నైట్‌హుడ్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం
ఎందుకు : ఇంగ్లండ్ క్రికెట్‌కు వీరు అందించిన సేవలకు గాను
Published date : 13 Sep 2019 06:09PM

Photo Stories