అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు ఆకృతిని రూపొందించిన వ్యక్తి?
ఈ మసీదుకి ఇంకా పేరు నిర్ణయించలేదని, చక్రవర్తిగానీ, రాజు పేరుమీదగానీ మసీదు ఉండబోదని ట్రస్ట్ పేర్కొంది. ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోనికి తీసుకొని మసీదు, దానిపక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ని విడుదల చేసింది. ఈ మసీదు ప్రాజెక్టు ఆకృతి(డిజైన్)ని జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ప్రొఫెసర్ ఎస్‌ఎమ్ అక్తర్ రూపొందించారు.
అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని 2019 ఏడాదిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 2021 ఏడాది ప్రారంభంలో పునాది రాయి వేయవచ్చునని భావిస్తున్నారు. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టి, రెండో దశలో ఆ ఆసుపత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది.
ధనిపూర్ గ్రామంలో...
బాబ్రీమసీదు స్థానంలో కొత్త మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ధనిపూర్ గ్రామంలో ఐదుఎకరాల భూమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కేటాయించింది. మసీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్ ట్రస్ట్ ను ఉత్తర్‌ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ ఏర్పర్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు ప్రాజెక్టు డిజైనర్
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ప్రొఫెసర్ ఎస్‌ఎమ్ అక్తర్
ఎక్కడ :ధనిపూర్, అయోధ్య, ఉత్తరప్రదేశ్