అయోధ్య వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం
Sakshi Education
రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉంటారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో 2019, జనవరి 10న ఈ ధర్మాసనం వివిధ వర్గాల వాదనలు విననుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయోధ్య వివాదంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయోధ్య వివాదంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 09 Jan 2019 05:28PM