Skip to main content

అత్యుత్తమ వన్డే ఆటగాడిగా రోహిత్ శర్మ

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల-2019ను జనవరి 15న ప్రకటించింది.
Current Affairs ఈ అవార్డుల్లో ఉత్తమ ఆటగాడిగా గార్‌ఫీల్డ్ గారీ సోబర్స్ పురస్కారానికి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 98 బంతుల్లో 84 పరుగులు చేసిన స్టోక్స్ తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. 2019లో వన్డేల్లో 12, టెస్టుల్లో 22 వికెట్లు తీశాడు.
 
 వన్డే ఆటగాడిగా రోహిత్ శర్మ : 2019 ఏడాది అత్యుత్తమ వన్డే ఆటగాడిగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచ కప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు సహా 81 సగటుతో రోహిత్ 648 పరుగులు సాధించాడు.
 
 టెస్టు ఆటగాడిగా కమిన్స్
: అత్యుత్తమ టెస్టు ఆటగాడి అవార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ కు దక్కింది. 2019లో కమిన్‌‌స 59 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
 
 ఉత్తమ అంపైర్‌గా రిచర్డ్ : 2019 ఏడాది ఉత్తమ అంపైర్‌గా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఎంపికయ్యాడు. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు మార్నస్ లబ్‌షేన్ (ఆస్ట్రేలియా)కు దక్కింది. టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శనగా భారత బౌలర్ దీపక్ చాహర్ మ్యాజిక్ స్పెల్ ఎంపికైంది.
 
 కోహ్లి క్రీడా స్ఫూర్తి : భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ప్రవర్తన ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ప్రేక్షకులు స్టీవ్ స్మిత్‌ను హేళన చేస్తుండగా... వద్దని వారించిన కోహ్లి చప్పట్లతో ప్రోత్సహించమని కోరి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు.
 
 ఐసీసీ టెస్టు జట్టు
: కోహ్లి (కెప్టెన్),  మయాంక్, లాథమ్, లబ్‌షేన్, స్మిత్, స్టోక్స్, వాట్లింగ్, కమిన్స్, స్టార్క్, వాగ్నర్, లయన్ 
 
 ఐసీసీ వన్డే జట్టు : కోహ్లి (కెప్టెన్), రోహిత్, షై హోప్, బాబర్ ఆజమ్,  విలియమ్సన్, స్టోక్స్, బట్లర్, స్టార్క్, బౌల్ట్, షమీ, కుల్దీప్ 

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : 2019 ఏడాది అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ఎంపిక
 ఎప్పుడు  : జనవరి 15
 ఎవరు  : భారత ఓపెనర్ రోహిత్ శర్మ

మాదిరి ప్రశ్నలు

1. ఐసీసీ గార్‌ఫీల్డ్ గారీ సోబర్స్ పురస్కారం-2019కి ఎవరు ఎంపికయ్యారు?
 1. రోహిత్ శర్మ  
 2. బెన్ స్టోక్స్
 3. ప్యాట్ కమిన్స్ 
 4. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్

Published date : 17 Jan 2020 05:49PM

Photo Stories